- Advertisement -
దుప్పి మాంసాన్ని విక్రయిస్తున్న వ్యక్తిని రాజన్న సిరిసిల్ల జిల్లా, గంభీరావుపేట పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. గంభీరావుపేట మండలం, ముస్తాఫానగర్ అటవీ ప్రాంతంలో కోనరావుపేట మండలానికి చెందిన గంట కొమురయ్య అనే వ్యక్తి దుప్పిని వేటాడి చంపి, ముక్కలుగా చేసి విక్రయిస్తున్నాడన్న సమాచారం మేరకు ఫారెస్టు అధికారులు పట్టుకున్నారు. అతని నుంచి 30 కేజీల దుప్పి మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఎఫ్‌ఆర్‌ఓ శ్రీహరి ప్రసాద్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వన్యప్రాణులను ఎవరు వేటాడినా ఉపేక్షించేది లేదని, వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.
- Advertisement -