Thursday, February 13, 2025

నేడు పార్లమెంట్‌కు కొత్త ఐటి బిల్లు

- Advertisement -
- Advertisement -

కొత్తగా టాక్స్ ఇయర్ చేరిక అసెస్‌మెంట్ ఇయర్ తొలగింపు మరింత సరళంగా ,
సంక్షిప్తంగా, స్పష్టంగా ఉండనున్న కొత్త చట్టం డిజిటల్ గవర్నెన్స్, ఆధునిక విధానాలకు
చోటు ఉద్యోగుల స్టాక్ ఆప్షన్స్, పన్ను వ్యవస్థపై స్పష్టత స్వతంత్రంగా కొత్త
పథకాలు అమలు చేసే అధికారం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డుకు దఖలు

న్యూఢిల్లీ: ప్రభుత్వం నేడు పార్లమెంటులో కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ కొత్త బిల్లు 622 పేజీలలో 536 విభాగాలు, 23 అధ్యాయాలు, 16 షెడ్యూళ్లతో ఉంటుంది. ఆరు దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం 1961 స్థానంలో వస్తోంది. కొత్త బిల్లులో ‘అసెస్‌మెంట్ ఇయర్’ అనే పదాన్ని తొలగించి, ‘టాక్స్ ఇయర్’ను తీసుకొస్తున్నారు. 1961 నాటి పాత చట్టంలో 298 సెక్షన్లు ఉండగా, ఇ ప్పుడు అవి 536కి పెరిగాయి. షెడ్యూల్‌ల సం ఖ్యను ప్రస్తుత 14 నుండి 16కి పెంచారు. కానీ అధ్యాయాల సంఖ్యను 23 వద్ద స్థిరంగా కొనసాగించారు. అయితే 622 పేజీలలో కొత్త బిల్లు మునుపటి కంటే మరిం త సంక్షిప్తంగా,

స్పష్టంగా ఉంది. కొత్త చట్టంలో డిజిటల్ గవర్నెన్స్, ఆధునిక విధానాలను స్వీకరించారు. స్టాక్ మార్కెట్, ఉద్యోగుల స్టాక్ ఆప్షన్స్ (ఇఎస్‌ఒపిలు)పై పన్ను వ్యవస్థపై స్పష్టత ఉంటుంది. గతంలో ఆదాయపు పన్ను శాఖ ఏదై నా పన్ను పథకం, విధానపరమైన విషయాలు, అనుమతి నియమాలకు పార్లమెంటు ఆమోదం పొందాల్సి ఉండేది. ఇప్పుడు, కేంద్ర ప్రత్యక్ష ప న్నుల బోర్డు (సిబిడిటి)కి కొత్త పథకాలను స్వతంత్రంగా అమలు చేసే అధికారం ఇచ్చారు ఇది కొత్త పన్ను నియమాలను అమలు చేయడానికి పట్టే సమయాన్ని తగ్గిస్తుంది. పన్ను పరిపాలనను మ రింత సమర్థవంతం చేస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News