Thursday, February 13, 2025

కెప్టెన్‌గా స్టీవ్‌స్మిత్

- Advertisement -
- Advertisement -

ఛాంపియన్స్ ట్రోఫీకి ఆసీస్ టీమ్ ఎంపిక

మెల్‌బోర్న్: ప్రతిష్ఠాత్మకమైన ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే ఆస్ట్రేలియా టీమ్‌ను బుధవారం ప్రకటించారు. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్‌తో సహా పలువురు కీలక ఆటగాళ్లు టోర్నీకి దూరమయ్యారు. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా ఐదు మార్పులతో తాజా జట్టును ప్రకటించింది. సీనియర్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. కాగా, కమిన్స్‌తో పాటు సీనియర్లు జోష్ హాజిల్‌వుడ్, మిఛెల్ స్టార్క్, మిచెల్ మార్ష్‌లు టోర్నమెంట్‌కు అందుబాటులో లేకుండా పోయారు. స్టార్క్ వ్యక్తిగత కారణాలతో మెగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. మిగతా వారు గాయాలతో వైదొలిగారు. ఇదిలావుంటే పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా టీమ్‌ను గాయాల బాధ వెంటాడుతోంది. కీలక ఆటగాళ్లు లేకుండా ఈసారి బరిలోకి దిగాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ట్రావిస్ హెడ్, స్మిత్, మాక్స్‌వెల్, లబుషేన్, అలెక్స్ కేరీ తదితరులతో కూడిన ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేయలేం. ఎలాంటి పరిస్థితి ఎదురైనా తట్టుకుని ముందుకు సాగే సత్తా ఆసీస్‌కు ఉంది.

జట్టు వివరాలు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ కేరీ, బెన్ డ్వారిషూస్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్, ఆరోన్ హార్టీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సన్ జాన్సన్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంఘా, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News