మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ’లైలా’ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించింది. లైలా చిత్రం ఫిబ్రవరి 14న బిగ్ స్క్రీన్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో విశ్వక్‌సేన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “-ఆర్టిస్ట్‌గా కొన్ని పాత్రలు చేయాలని ప్రతి నటుడికి ఉంటుంది. భామనే సత్యభామనే, మేడం, చిత్రం భళారే విచిత్రం, రెమో సినిమాలు చూసినప్పుడు ఆర్టిస్టుగా ఇలాంటి గెటప్ చేయాలని ఉండేది. అలాగే ఆడియన్స్ ఇప్పుడు కొత్త కథలని, థీమ్స్ ని కోరుకుంటున్నారు. ఇలాంటి సినిమాలురాక దాదాపుగా రెండు దశాబ్దాలు అవుతుంది. ఈ తరంలో ఒక హీరో అమ్మాయి పాత్ర వేయడం గత 20 ఏళ్లుగా మనం చూడలేదు. ఆ లోటుని భర్తీ చేయాలని ఒక మంచి కథ రావడంతో ఈ సినిమా చేయడం జరిగింది. -సినిమాలోని లైలా క్యారెక్టర్ నాకు ఇష్టమైనది. కానీ సోను క్యారెక్టర్‌కు కూడా మీరు ఫ్యాన్స్ అయిపోతారు.
ఫస్ట్ హాఫ్‌లో సోను మోడల్ లైఫ్‌స్టైల్‌ని తన క్యారెక్టర్‌ని చాలా ఎంజాయ్ చేస్తారు. మూడు సమస్యల నుంచి బయటపడడానికి సోను లైలాగా మారుతాడు. అది ఏంటనేది బిగ్ స్క్రీన్ మీద చూడాలి. ఇక లేడీ గెటప్‌లోకి మారడానికి -దాదాపు రెండున్నర గంటలు పట్టేది. మేకప్ ఆర్టిస్ట్ నిక్కీ ఎక్కడ కూడా రాజీపడలేదు. లేడీ గెటప్ చాలా నేచురల్‌గా వచ్చింది. యూత్‌ఫుల్ కంటెంట్‌తో తెరకెక్కిన సినిమా ఇది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్. -సినిమాలో మీనాక్షిది చాలా సర్‌ప్రైజింగ్ రోల్. అద్భుతంగా నటించింది. అభిమన్యు సింగ్ క్యారెక్టర్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఆయన కెరీర్‌లో ఇది చాలా డిఫరెంట్ రోల్. ఈ రెండు కాకుండా ఇంకొక సర్‌ప్రైజింగ్ యాక్టర్ కూడా ఇందులో ఉన్నారు. గుళ్ళు దాదా క్యారెక్టర్‌ను కూడా ఎంజాయ్ చేస్తారు. -లియోన్ జేమ్స్ సాంగ్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. థియేటర్స్‌లో ఇంకా ఎంజాయ్ చేస్తారు”అని అన్నారు.