- Advertisement -
హైదరాబాద్: వైసిపి నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ పోలీసుల సహకారంతో ఎపి పోలీసులు ఆయనను రాయదుర్గంలోని మైహోం భుజాలో అరెస్ట్ చేశారు. అనంతరం వంశీని గచ్చిబౌలి నుంచి ఔటర్ రింగు రోడ్డు మీదుగా విజయవాడకు తరలించారు. ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసులో వల్లభనేని వంశీని ఎపి పోలీసులు అరెస్టు చేశారు. గన్నవరం టిడిపి కార్యాలయంపై దాడి కేసులో వంశీ నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో వంశీ ముందస్తు బెయిల్ తీసుకున్న విషయం తెలిసిందే. వైసిపి నేతలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసి చిత్ర హింసలు పెడుతోందని వైసిపి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. టిడిపి ఆఫీస్ దాడి కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్థన్ తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారని వైసిపి నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
- Advertisement -