- Advertisement -
హైదరాబాద్: నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ వెలుగులోకి వచ్చింది. బుధవారం రాత్రి హిమాయత్ నగర్ లోని మినర్వ హోటల్ గల్లీలో ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. బీహార్ కు చెందిన వ్యక్తి ఓ ఇంట్లో పని చేస్తున్నాడు. ఆ ఇంటికి కన్నవేసి సుమారు 2 కోట్లు విలువ చేసే బంగారం , డైమెండ్స్, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. ఇంటి యజమాని దుబాయ్ లో ఉండటంతో అతని వద్ద పని చేసే అభయ్ కెడియా అనే వ్యక్తి నారాయణగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అభయ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -