- Advertisement -
అమరావతి: రాజకీయ లబ్ధి కోసమే లడ్డూలో కల్తీ జరిగిందని దుష్ప్రచారం చేశారని వైసిపి నేత, మాజీ దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా కొట్టు మీడియాతో మాట్లాడారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను ఎల్లో మీడియా దెబ్బతీసిందని మండిపడ్డారు. చంద్రబాబు ఆరోపణలు నిజం అన్నట్టు సిట్ ఎక్కడా చెప్పలేదన్నారు. సిట్ చెప్పకపోయినా టిటిడి, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని కొట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వైఫల్యాలను కప్పిపుచ్చాలనే డైవర్షన్ పాలిటిక్స్ అని విమర్శించారు. నెయ్యిలో కల్తీ జరిగి ఉంటే అడ్డుకునే బలమైన వ్యవస్థ టిటిడిలో ఉందని, చంద్రబాబు తగినశాస్తి అనుభవించక తప్పదని సత్యనారాయణ హెచ్చరించారు.
- Advertisement -