Friday, February 14, 2025

ఢిల్లీ విమానాశ్రయంలో స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు బ్రెజిలియన్ మహిళలు అరెస్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దాదాపు రూ. 26 కోట్ల విలువ చేసే కొకైన్‌ను స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు బ్రెజిలియన్ మహిళలను వేర్వేరు కేసుల్లో అరెస్టు చేశారు. వారు దక్షిణ అమెరికా నుంచి యూరొప్ గుండా ఇండియాకు క్యాప్సుల్స్ రూపంలో వాటిని దాపెట్టి తెచ్చారని కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. వారిని ప్రశ్నించినప్పుడు వారు క్యాప్సుల్స్‌లో నార్కొటిక్స్‌ను దాపెట్టి తెచ్చినట్లు వారు ఒప్పుకున్నారు. ఇద్దరి నుంచి రూ. 25.91 కోట్లు విలువచేసే 1.72 కిలోలు ఉండే 172 కొకైన్ క్యాప్సుల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ తన ‘ఎక్స్’ పోస్ట్‌లో పెట్టింది. ఇంటర్నేషనల్ సిండికేట్‌ను ట్రాక్ చేయడానికి మరింతగా పరిశోధన జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News