Friday, February 14, 2025

ముగిసిన ఎంఎల్‌సి నామినేషన్ల ఉపసంహరణ

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి స్థానాల ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం(ఫిబ్రవరి 13) ముగిసింది. మెదక్ -నిజామాబాద్ -ఆదిలాబాద్- కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల ఎంఎల్‌సి స్థానానికి నామినేషన్లు దాఖలు చేసిన వారిలో 15 మంది ఉపసంహరించుకోగా, 56 మంది బరిలో నిలిచారుర. అలాగే మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ -కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఒకరు నామినేషన్‌ను ఉపసంహరించుకోగా, 15 మంది పోటీలో ఉన్నారు.

దాంతోపాటు వరంగల్ -ఖమ్మం -నల్లగొండ ఉపాధ్యాయ ఎంఎల్‌సి స్థానానికి ముగ్గురు నామినేషన్లు ఉపసంహరించుకోగా, 19 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఈ మూడు ఎంఎల్‌సి స్థానాలకు ఈ నెల 3న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా, ఈనెల 10వ తేదీతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది.నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారంతో వరకు గడువు ఉంది. ఈనెల 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News