Friday, February 14, 2025

మహిళా జడ్జిపై చెప్పు విసిరిన నిందితుడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా కోర్టులో కలకలం రేగింది. కోర్టు హాల్‌లో కేసు విచారణలో మహిళ జడ్జిపై నిందితుడు చెప్పులు విసరడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతవారణం నెలకొంది. వివరాల్లోకి వెళితే.. అత్తాపూర్ సిక్ విలేజీకి చెందిన కరణ్ సింగ్ అలియాస్ సర్దార్ చీమకొర్తి (22) పలు నేరాల్లో నేరస్థుడు. కాగా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. కేసు విచారణలో భాగంగా ఈనెల 12న రంగారెడ్డి జిల్లా 9వ అడిషనల్ సెషన్స్ జడ్జి హరిష నిందితుడికి జీవిత ఖైదీ విధిస్తూ తీర్పు వెలువరించారు.

ఈ క్రమంలో నిందితుడిని కోర్టులో హాజరు పరచుగా కరణ్‌సింగ్ జైలులో తనకు ఎదురువుతున్న ఇబ్బందులపై జడ్జికి వివరించే ప్రయత్నించే క్రమంలో ఒక్కసారిగా తన కాలుకు ఉన్న చెప్పును తీసి మహిళ జడ్జిపై విసిరాడు. ఈ పరిణామంతో జడ్జి, న్యాయవాదులు ఉలిక్కి పడ్డారు. దీంతో పోలీసులు వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. జడ్జిపై దాడికి నిరసనగా శుక్రవారం అన్ని కోర్టుల్లో విధులు బహిష్కరిస్తున్నట్లు న్యాయవాదులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News