- Advertisement -
బిఆర్‌ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసుల గురించి తీవ్రంగా స్పందించిన ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత పింక్ బుక్‌లో అన్ని రాసుకుంటున్నామని, అధికారంలోకి రాగానే తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. గురువారం జనగామ జిల్లా పెంబర్తిలో పర్యటించి అనంతరం బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎంఎల్ఎ టి.రాజయ్య అధ్యక్షతన నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. లెక్కలు ఎలా తీయాలో మాకు తెలుసు.. మీ లెక్కలు తీస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. రైతు డిక్లరేషన్‌పై నిలదీస్తారని రాహుల్‌గాంధీ వరంగల్ పర్యటన రద్దు చేసుకున్నారన్నారు. సామాజిక మాధ్యమాల్లో చిన్న విమర్శ చేసినా సిఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నారన్నారు. సంక్రాంతి నుంచి సన్న బియ్యం ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పటికి ఇవ్వలేదన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -