- Advertisement -
లంగర్ హౌస్ టిప్పు ఖాన్ బ్రిడ్జి వద్ద కార్ దగ్ధమైంది. గురువారం సాయంత్రం సుమారు 7:40 నిముషాల సమయం లో లంగర్ హౌస్ నుంచి బండ్లగూడ వైపు వెళుతున్న కార్ లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ కారును పక్కన అపి ప్రాణ నష్టం జరుగకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ ఘటన తో రోడ్డు కు ఇరువైపులా కిలోమీటర్ మేర ట్రాఫిక్ స్తంభించింది. ఫైర్ సిబ్బంది సంఘ టన స్థలానికి చేరుకొని మాటలను అర్పారు. ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు ట్రాఫిక్ ను క్రమంబద్దికరించారు. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
- Advertisement -