మద్యం ఇప్పించలేదని ఓ తాగుబోతు యువకుడిని గాయపర్చిన సంఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిదిలో చోటు చేసుకుంది. సిఐ భాస్కర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కుషాయిగూడ పద్మావతి కాలనీలో నివాసముండే మహ్మద్ పాషా (29) గురువారం మద్యం మత్తులో అటుగా వెలుతున్న తనకు తెలిసిన కిరణ్ కుమార్ తన మిత్రుడు అరుణ్ ను ఆపి తనకు మద్యం ఇప్పించాలని వేదించాడు. వాళ్లు ఎంతకు ఇప్పించకపోవడంతో అహ్మద్‌పాషా ఇప్పేడే వాస్తానని ఇంట్లోకి వెళ్లి కూరగాయలు కోసే కత్తి తీసుకొని వచ్చాడు.
అహ్మద్‌పాషా ఇంట్లోకి వెళ్లడంతో కిరణ్, అరుణ్ లు అక్కడి నుంచి వెల్లిపోయారు. కుషాయిగూడ విజయ్‌నగర్ కాలనీలో నివాసముండే మహేష్(28) అదే సమయంలో పద్మావతి కాలనీకి వచ్చి ఉన్నాడు. మహేష్ ,కిరణ్, అరుణ్ మిత్రులని భావించిన అహ్మద్‌పాషా తనకు మద్యం ఇప్పించమంటే ఇప్పించడం లేదని మహేష్‌ను బెదిరిస్తూ కత్తితో పొడిచి రాయితో కొట్టాడు. పక్కన ఉన్నవారు మహేష్‌ను ఈసిఐఎల్‌లోని ప్రైవెట్ ఆసుపత్రికి తరలించారు. మహేష్ సోదరుడు వెంకటేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సిఐ తెలిపారు.