బాణసంచా శబ్ధానికి గుడిలో ఉన్న ఏనుగులు బెదిరిపోయిన భక్తులను తొక్కి చంపిన ఘటన కేరళ లో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..పోలీసుల కథనం ప్రకారం కేరళ లోని కోజికోడ్ జిల్లాలోని కోయిలాండి సమీపంలో కురవగండ్ మనక్కలంగర భగవతి ఆలయంలో వార్షిక ఉత్సవం జరుగుతుంది. ఈ క్రమంలో ఉత్సవం చివరి రోజున నిర్వహాకులు రెండు ఏనుగులను తీసుకువచ్చారు. ఉత్పవంలో భాగంగా స్ధానికులు బాణసంచా పేల్చారు. బాణసంచా శబ్ధానికి రెండు ఏనుగులు బెదిరిపోయి భక్తుల మీదకు తొక్కుకుంటు వెళ్లాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
భక్తులను తొక్కి చంపిన ఏనుగులు
- Advertisement -
- Advertisement -
- Advertisement -