Saturday, February 15, 2025

నా దగ్గర వీడియో ఫ్రూఫ్ లు ఉన్నాయి:నటి అమీషా పటేల్

- Advertisement -
- Advertisement -

గదర్ 2 సినిమా క్లైమాక్స్ విషయంలో దర్శకుడు అనిల్ శర్మ, నటి అమీషా పటేల్ మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. గదర్ ఏక్ ప్రేమ్ కథ కు సీక్వెల్ గా గదర్ 2 పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. ఈ చిత్రంలో సన్నీదేవోల్, అమీషా పటేల్ ప్రధాన పాత్రలు పోషించారు. గతేడాది విడుదలై మంచి విజయం అందుకున్న మూవీ గురించి నటి అమీషా పటేల్ ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. సినిమా క్లైమాక్స్ ను తనకు మాట మాత్రం చెప్పకుండా దర్శకుడు మార్చేశారని అన్నారు. ఈ సినిమాలో అమీషా పటేల్ ప్రతి నాయకుడి పాత్ర (సకినానే) ను చంపాలని ముందుగా దర్శకుడు రాసుకున్నారని, అది తన కెంతో నచ్చిందన్నారు. కానీ షూటింగ్ కి వచ్చే సరికి దర్శకుడు అనిల్ సీన్ మార్చేశారని, ప్రతి నాయకుడి పాత్ర (చరణ్ జీత్) అనిల్ శర్మ కొడుకు ఉత్కర్ష్ శర్మ ను చంపేలా క్రియేట్ చేశారన్నారు. సినిమా స్టోరీ నరేషన్ కు సంబంధించికొన్ని వీడియోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News