- Advertisement -
అమరావతి: సమీక్షలు తప్ప హామీల అమలు కనిపించడం లేదని వైసిపి ఎమ్మెల్సీ బొత్ససత్యనారాయణ తెలిపారు. ప్రచార ఆర్భాటంతప్ప… ఏమీ లేదని మండిపడ్దారు. ఈ సందర్భంగా బొత్స మీడియాతో మాట్లాడారు. ఎపిలో హామీలు అమలు కావడం లేదని విమర్శలుగుప్పించారు. నిత్యవసరాల ధరలు ఆకాశాన్నంటాయని, దీంతో పాటు కరెంట్ ఛార్జీలు విపరితంగా పెరిగాయని బాధను వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం లేదని తెలియజేశారు. సూపర్ సిక్స్ హామీలపై శాసన మండలిలో నిలదీస్తామని బొత్స సత్యనారాయణ ఎపి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
- Advertisement -