Saturday, February 15, 2025

బేరసారాల్లో నాకంటే మోడీయే బెస్ట్ : ట్రంప్ వ్యాఖ్య

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అయిన ప్రధాని నరేంద్రమోడీ పలు అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం ఈ ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో ఒకరిపై మరొకరికి ఉన్న స్నేహాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.న దానికి ట్రంప్ సరదాగా సమాధానం ఇచ్చారు.
ట్రంప్, మోడీ .. ఈ ఇద్దరిలో మెరుగ్గా బేరమాడేది ఎవరు ? అని మీడియా ప్రశ్నించింది. “ ఆ విషయంలో మోడీనే నాకంటే చాలా మెరుగ్గా బేరసారాలు ఆడగలరు. అందులో ఎలాంటి అనుమానం లేదు. ” అని ట్రంప్ బదులిచ్చారు.

అలాగే పరస్పర సుంకాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. “ సుంకాలు, పన్నులు పరస్పరం ఉంటేనే న్యాయంగా ఉంటుంది” అని స్పష్టం చేశారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోడీ ,దానిని ముగించుకుని స్వదేశానికి పయనమయ్యారు. వీరి భేటీలో సుంకాలు, వలసలు, ఇరు దేశాల వ్యూహాత్మక అంశాలపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. “ చాలా ఏళ్లుగా మోడీ నాకు స్నేహితుడు. మా స్నేహాన్ని రానున్న నాలుగేళ్లు కొనసాగిస్తాం. ప్రపంచంలో ఏ దేశానికి లేనివిధంగా మాకు ఆయిల్, గ్యాస్ వనరులు అందుబాటులో ఉన్నాయి.అవి భారత్‌కు కావాలి. మా ఇద్దరి మధ్య గొప్ప ఐక్యత, స్నేహం ఉన్నాయి. దేశాలుగా భారత్, అమెరికా కలిసి ఉండటం చాలా ముఖ్యం.

మేం ఎవర్నీ ఓడించాలనుకోవడం లేదు. మంచి చేయాలని చూస్తున్నాం. అమెరికా ప్రజల కోసం అద్భుతంగా పనిచేశాం. అమెరికాలో గత పాలన మాకు అంతరాయం కలిగించింది” అని ట్రంప్ అన్నారు. అమెరికా దిగుమతులపై సుంకాలు విధిస్తే ప్రతీకార సుంకాలు తప్పవు ఇక ఈ భేటీకి కొన్ని గంటల ముందు అధ్యక్షుడు సుంకాల కొరడా ఝళిపించారు. అమెరికా దిగుమతులపై సుంకాలు విధించే అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తామని ప్రకటించారు. ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల ప్రభావం అభివృద్ధి చెందుతున్న దేశాలైన భారత్, బ్రెజిల్,వియత్నాం తోపాటు తూర్పు ఆసియా, ఆఫ్రికా దేశాలపై పడనుంది. ప్రస్తుతం భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా సగటున 3 శాతం సుంకాలను విధిస్తోంది. భారత్ 9.5 శాతం సుంకాలను విధిస్తోంది. దీనిపైనే ట్రంప్ ఆగ్రహంగా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News