- Advertisement -
అమరావతి: గులియన్ బారీ సిండ్రోమ్ పై నిరంతరం సమీక్షిస్తున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జిబిఎస్ పై ఆందోళన వద్దని అన్నారు. ఈ సందర్భంగా అనంతపురంలో సత్య కుమార్ మీడియాతో మాట్లాడారు. వ్యాక్సిన్ల కోసం ఇండెంట్ కూడా పెట్టామని చెప్పారు. బర్డ్ ప్లూ మనుషులకు సోకిందనేది వదంతులేనని పేర్కొన్నారు. కూటమి నేతల మధ్య ఎలాంటి అంతరాలు లేవని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు.
- Advertisement -