అమరావతి: సంత్ సేవాలాల్ ఎపిలో పుట్టిన ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ సేవ చేశారని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మహాత్మగాంధీ కంటే ముందే సంత్ సేవాలాల్ అహింస పాటించారని అన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. సంత్ సేవాలాల్ అహింస సిద్ధాంతం బోధించారని తెలియజేశారు. ఈనాడు మనం ఆచరిస్తున్న ఆర్థిక విధానాలు ఆయన అప్పుడే బోధించారని, సంత్ సేవాలాల్ మార్గంలో ప్రయాణిస్తే అందరికి మేలు జరుగుతుందని సిఎం చెప్పారు. అందరి మనోభావాలను కాపాడుతూనే కూటమి సర్కారు పనిచేస్తుందని అన్నారు. పేదలు, ప్రత్యేకంగా గిరిజనులకు సేవ చేసిన ఘనత ఎన్టీఆర్ కు దక్కుతుందని వెల్లడించారు. గిరిజనుల్లోని వెనుకబాటును తగ్గించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, గిరిజన చట్టాలను కూటమి ప్రభుత్వం కాపాడుతుందని పేర్కొన్నారు. వెల్తీ, హెల్తీ, హ్యాపీ అనే సిద్ధాంతాలతో కూటమి ప్రభుత్వం పని చేస్తోందని, తండాల నుంచి ఎంతో మందిని రాజకీయంగా ప్రోత్సహించామని చంద్రబాబు స్పష్టం చేశారు.
గిరిజన చట్టాలను కూటమి ప్రభుత్వం కాపాడుతుంది: చంద్రబాబు
- Advertisement -
- Advertisement -
- Advertisement -