సోషల్‌మీడియా వాడకం పెరిగిపోయాక సిని తారల విషయాలు అన్ని అభిమానులకు ఇట్టే తెలిసిపోతున్నాయి. గతంలో అయితే తమ అభిమాన హీరో లేదా హీరోయిన్ ఏం మాట్లాడారో తెలియాలి అంటే.. అ మరుసటి రోజు పత్రికలో రావాల్సిందే. కానీ ఇప్పుడు అలా కాదు.. వాళ్లు ఏం మాట్లాడిన అది క్షణంలోనే అది మనకు అందుబాటులోకి వస్తుంది. ఇది నాణెనికి ఇకవైపు మాత్రమే.
ఇంకోవైపు చూస్తే.. సోషల్‌మీడియా కారణంగా నటీనటులపై విపరీతంగా ట్రోలింగ్ పెరిగిపోతుంది. ఏ ఫంక్షన్‌లో అయినా.. ఎవరైనా నటీనటులు నోరుజారితే.. వాళ్లను సోషల్‌మీడియాలో ఏకిపారేస్తున్నారు. కొందరు ఈ ట్రోలింగ్ భరించలేక క్షమాపణలు చెబితే.. మరికొందరు మాత్రం ఏం పట్టనట్లు వ్యవహరిస్తూ పోతుంటారు. ఇప్పుడు అలాంటి ట్రోలింగ్‌నే నేషనల్ క్రష్ రష్మిక మందన ఎందుకుంటుంది. గత ఏడాదిని ‘పుష్ప-2’ సక్సెస్‌తో ముగించిన రష్మిక.. ఈ ఏడాది భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘ఛావా’ చిత్రంతో ప్రారంభించింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ముంబయిలో జరిగిన ఓ ఈవెంట్‌లో రష్మిక చేసిన వ్యాఖ్యలు కన్నడ వాసులను ఆగ్రహానికి గురి చేశారు. ఈ ఈవెంట్‌లో రష్మిక మాట్లాడుతూ.. ‘‘నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నాపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ఎంతో సంతోషంగా ఉంది’’ అని అంది. దీంతో కన్నడ ఫ్యాన్స్ ఆమెపై ఫైర్ అవుతున్నారు. రష్మిక సొంతూరు అయిన విరాజ్‌పేట్ ఎప్పుడు హైదరాబాద్‌కు వచ్చింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. గతంలో కూడా పుష్ప-1 విజయం తర్వాత రష్మిక మాట్లాడుతూ తనకు తొలి అవకాశం ఇచ్చిన నిర్మాణ సంస్థ పేరు చెప్పనందుకు విమర్శలు ఎదురుకుంది.