ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టెస్లా భారత్‌లోకి అడుగుపెడుతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్ర.. తనకు నచ్చిన వీడియోలను అభిమానులతో పంచుకుంటారు. అంతేకాదు.. ఆ వీడియోలోని వ్యక్తులకు ఏదైనా అవసరం ఉంటే ఆయన సహాయం చేస్తుంటారు.
తాజాగా టెస్లా కంపెనీ ఇండియాలోకి వస్తే.. ఆ పోటీని ఎలా తట్టుకుంటారు అని ఆనంద్ మహీంద్రను ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ‘1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చినప్పుడు టాటా, మారుతి మరియు అన్ని అంతర్జాతీయ సంస్థలతో ఎలా పోటీ పడతారు అని ప్రశ్నలు వచ్చాయి. కానీ మేము పోటీ పడి నిలబడ్డాము. మా ఉత్పత్తులపై మాకు ఉన్న నమ్మకం అది. టెస్లా మార్కెట్‌లోకి వచ్చినా.. మా కంపెనీ అలాగే ఉంటుంది. 2018లో ఎలాన్ మస్క్ సంస్థ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎలా మద్ధతు ఇచ్చానో.. ఇప్పుడు అలాగే ఇస్తా’ అంటూ మహీంద్ర అన్నారు.