Wednesday, March 26, 2025

బయ్యారంలో రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు ఫ్యాక్టరీ పెట్టొచ్చు:ఈటల రాజేందర్

- Advertisement -
- Advertisement -

ప్రజలకు ఉపాధి కల్పించాలనే ఆలోచన ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయవచ్చునని బిజెపి నేత, మల్కాజ్‌గిరి ఎంపి ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ది ఉంటే బయ్యారంలో ప్రభుత్వమే ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని తెలిపారు. హైదరాబాద్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు రాలేదన్న ప్రచారం వాస్తవం కాదని, చాలా నిధులు కేంద్రం మంజూరు చేసిందని తెలిపారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి కేంద్ర ప్రభుత్వం రూ.6,300 కోట్లు మంజూరు చేసిందని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తోందని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం మేకిన్ ఇండియాకు ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు వేలాది కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. కేంద్రం ఇంత చేస్తుంటే, బయ్యారంలో ప్రజలకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకోవచ్చు కదా అని ఈటల ప్రశ్నించారు. రాష్ట్రాల వారీగా కులగణనకు తమ పార్టీ అనుకూలమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీసీల జనాభా ఎందుకు తగ్గిందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని నిలదీశారు. కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News