ప్రమాదకరస్థాయిలో బ్యాక్టీరియా వ్యాప్తి
కలరా, టైఫాయిడ్ వంటి భయంకర
వ్యాధుల ముప్పు 100 మిల్లీలీటర్ల
నీటిలో 11,000 వరకు కోలీఫామ్
బ్యాక్టీరియాను గుర్తించిన సిపిసిబి
న్యూఢిల్లీ : ప్రయాగ్‌రాజ్ లోని గంగా, యమునా న దీ జలాల్లో మహా కుంభమేళా సందర్భంగా కొన్ని కో ట్ల మంది స్నానాలు ఆచరించడంతో మానవ, జంతు మల విసర్జనాల సంబంధమైన కోలీఫామ్ బ్యాక్టీరి యా విపరీతంగా వ్యాపించించడం ఆందోళన కలిగిస్తోంది. ఈమేరకు జాతీయ హరిత ట్రిబ్యునల్‌కు కేం ద్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదిక సమర్పించింది. గంగా యమునా జలాల్లో అత్యధికంగా కోలీఫామ్ బ్యాక్టీరియా విస్తరించడంతో స్నానాలకు కావలసిన ప్రమాణాలు లేవని వెల్లడించింది. ఫిబ్రవరి 3న సమర్పించిన ఈ నివేదికలో ప్రయాగ్‌రాజ్ లోని సం గం వద్ద వివిధ పాయింట్ల వద్ద , ముఖ్యంగా షా హిస్నాన్ వద్ద కోలీ బ్యాక్టీరియా అత్యధికంగా ఉం దని పేర్కొంది. నీటి నాణ్యత గురించి వివరిస్తూ ఒక 100 మిల్లీ లీటర్ల నీటిలో 2500 కోలీఫామ్ బ్యాక్టీరియాలున్నా ఆ నీరు స్నానానికి యోగ్యమైనదేనని,
అంత కు మించి ఉంటే చర్మసంబంధ వ్యాధులు వస్తాయని నివేదిక వెల్లడించింది. అయితే ఫిబ్రవరి 4న సిపిసిబి నమోదు చేసిన వివరాల ప్రకారం గంగానదిలో శాస్త్రి బ్రిడ్జి ముందు 100 మిల్లీ లీటర్ల నీటిలో 11,000 వరకు కోలీఫామ్ బ్యాక్టీరియాలు వరకు ఉండగా, సంగం వద్ద 7900 కోలీఫామ్ బ్యాక్టీరియాలు కనిపించాయన నివేదిక వివరించింది. సంగం ప్రదేశానికి 2 కిమీ ముందుగా గంగా నదిపై శాస్త్రి బ్రిడ్జి ఉంది. సంగం వద్ద గంగానదితో కలిసే ముందు యమునా నదిలో పాత నైని బ్రిడ్జి వద్ద 100 మిల్లీ లీటర్ల నీటిలో 4900 కోలీఫామ్ బ్యాక్టీరియాలు బయటపడ్డాయి. షాహిస్నాన్ ఆచరించే రోజుల్లో ఒకటైన బసంత్ పంచమి నాడు ఈ డేటాను సేకరించారు. ఫిబ్రవరి 3న బసంత్ పంచమి వచ్చింది.
కోలీఫామ్ బ్యాక్టీరియా వల్ల అస్వస్థత కలగకపోయినప్పటికీ, మలం నుంచి పుట్టుకొచ్చే బ్యాక్టీరియా, వైరస్‌లు, లేదా ఏకకణ సూక్ష్మజీవులు (ప్రోటోజోవా) తదితర హానికరమైన క్రిములు కారణంగా కలరా, టైఫాయిడ్, అతిసారం, హెపటిటిస్, జియార్‌డైయాసిస్, గినియా క్రిములు, సిస్టోసొమియాసిస్ వంటి భయంకర వ్యాధులు వ్యాపిస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఈ విధమైన జలకాలుష్యంతో అనారోగ్య పరిస్థితులు దాపురించడమే కాకుండా, తాగడానికి, స్నానం చేయడానికి ఏమాత్రం పనికిరానివిగా నీళ్లు తయారవుతాయి. రైతులు కూడా ఈ జలాలనే తమ సాగుకు ఉపయోగించడం వ్యాధులకు దారి తీస్తోందని న్యూఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ హెచ్చరించింది. వ్యర్థ జలాల ప్రక్షాళన సరిగ్గా లేకపోవడం బ్యాక్టీరియా స్థాయిలు పెరిగిపోయి, రైతుల ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోందని ఉత్తరప్రదేశ్‌లో వారణాసిలో 1990 లో నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. మల పరీక్షలో కొంకిపురుగులు 41.7 శాతం, నులిపురుగులు 29.2 శాతం, ట్రైచూరియాసిస్ అనే పేగులకు సంక్రమించే పెద్ద నులిపురుగులు 16.7 శాతం, జియార్డియా అనే చిన్న పేగుల్లో వ్యాపించే నులిపురుగులు 33.3 శాతం ఉన్నట్టు తేలింది. దీనికి తోడు చర్మ వ్యాధులు 42.5 శాతం వరకు వ్యాపిస్తుంటాయని అధ్యయనం హెచ్చరించింది.