Saturday, February 22, 2025

రంగారెడ్డి జిల్లా పాత కోర్టు బిల్డింగ్ కూల్చివేత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హైకోర్టు ఆదేశాలతో సరూర్‌నగర్‌లోని రంగారెడ్డి జిల్లా పాత కోర్టు భవనం, ప్రాంగణ స్థలాన్ని హెచ్‌ఎండిఎ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే బుధవారం ఈ భవనాన్ని అధికారులు కూల్చివేశారు.

సరూర్‌నగర్ గ్రామ రెవెన్యూ పరిధిలో హుడా కాంప్లెక్స్ పక్కన హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సరూర్‌నగర్ కాంప్లెక్స్ నిర్మించి రంగారెడ్డి జిల్లా కోర్టు భవనం సముదాయాలకు కేటాయించింది. 2008లో ఆ భవనాన్ని ఎల్‌బి నగర్‌కు తరలించగా.. కాంప్లెక్ ఖాళీ అయింది. అప్పటి నుంచి కొందరు వ్యక్తులు బిల్డింగ్‌ను లీజ్‌కు తీసుకొని, దుకాణదారులకు అద్దెకు ఇస్తు వచ్చారు. కానీ, లీజ్ డబ్బులు మాత్రం చెల్లించలేదు.

దీంతో షాపులను ఖాళీ చేయాలని అధికారులు నిర్వాహకులకు నోటీసులు ఇవ్వగా కొందరు ఖాళీ చేయకుండా హైకోర్టును ఆశ్రయించారు. కానీ, హైకోర్టులో వారికి చుక్కెదురైంది. వారం రోజుల క్రితం ఈ భవనాన్ని, ప్రాంగణాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు..బుధవారం నేలమట్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News