దుబాయ్: టీం ఇండియా స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు అంటే.. భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉంటారు. ఎంతో మంది యువ క్రికెటర్లు వారికి బౌలింగ్ వేయాలని.. వారిని ఔట్ చేయాలని కలలు కంటారు. అలాంటి అరుదైన అవకాశమే పాకిస్థాన్‌కు చెందిన ఫాస్ట్ బౌలర్ అవైస్ అహ్మద్‌కు లభించింది.
ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు ఇప్పటికే భారత జట్టు దుబాయ్‌కి చేరుకొని అక్కడ ప్రాక్టీస్ ప్రారంభించింది. అయితే అక్కడ భారత ఆటగాళ్లకి నెట్స్‌లో బౌలింగ్ వేసే అవకాశం ఖైబర్ పఖ్తున్‌ఖ్వాకు చెందిన అవైస్‌కు లభించింది. అయితే అవైస్ బౌలింగ్ తీరు భారత స్టార్ బ్యాట్స్‌మెన్లను విపరీతంగా ఆకర్షించింది.
ముఖ్యంగా అతను వేసిన ఇన్‌స్వింగ్ యార్కర్లకు ఫిదా అయిపోయారు. ప్రాక్టీస్ ముగిసిన అనంతరం రోహిత్ అవైస్‌ని పిలిచి వెన్నుతట్టి అభినందించారు. తన బౌలింగ్‌తో కాలు విరగొట్టేలా ఉన్నావు అంటూ హాస్యంగా కితాబు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. అనంతరం ఫిబ్రవరి 23వ తేదీన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తలపనుంది. లీగ్ దశలో చివరిగా మార్చి 2వ తేదీన భారత్, న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆడనుంది.