Saturday, February 22, 2025

త్రివేణి సంగమంలో నీళ్లు కులుషితం.. యోగి రియాక్షన్

- Advertisement -
- Advertisement -

లక్నో: ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ మేళలో భాగంగా త్రివేణి సంగమంలోని నీరు కలుషితమైనది వచ్చిన వదంతులపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. సంగమంలోని నీరు పవిత్రస్నానం చేసేందుకు అన్ని విధాలుగా అనుగుణంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

త్రివేణి సంగమంలో నీళ్లు మురికిగా ఉన్నాయని.. వచ్చిన వార్తలపై ఆయన అసెంబ్లీ వేదికగా స్పందించారు. ఈ మహాకుంభ మేళకు భక్తులు రాకుండా చేసేందుకే ఇలాంటివి పుట్టిస్తున్నారని ఆయన అన్నారు. ‘సంగం పరిసర ప్రాంతాల్లోని అన్ని పైపులు, డ్రెయిన్‌లకు టేప్‌లు వేసి శుద్ధి చేసిన తర్వాతే నీటిని విడుదల చేస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్ కాలుష్య నివారణ బోర్డు నిరంతరం నీళ్ల శుద్ధిని పర్యవేక్షిస్తుంది. నివేదికల ప్రకారం నీటి యొక్క బిఒడి 3 కంటే తక్కువగా ఉంది. మరియు ఆక్సిజన్ శాతం 8-9 వరకూ ఉంది. కాబట్టి ఈ నీళ్లు స్నానం చేయడానికే కాదు.. ఆచమనం చేసుకుందుకు కూడా పనికి వస్తాయి’ అని యోగి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News