- Advertisement -
బర్దామాన్: టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. దుర్గాపూర్ రహదారిపై వెళ్తున్న ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయన స్వల్పగాయాలతో బయటపడ్డారు. శుక్రవారం ఆయన ఓ ఈవెంట్‌లో పాల్గొనేందుకు వెళ్తుండగా.. ఈ ఘటన జరిగింది.
పశ్చిమబెంగాల్ బర్దామాన్ జిల్లాలోని దుర్గాపూర్ ఎక్స్‌వేపై సౌరవ్ గంగూలీ కాన్వాయ్ ప్రయాణిస్తుండగా.. ఓ ట్రక్ ఓవర్‌టేక్ చేయడంతో డ్రైవర్ సడన్ బ్రేక్‌లు వేశాడు. దీంతో వెనుక ఉన్న కారులు గంగూలీ ప్రయాణిస్తున్న కారుని బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. 10 నిమిషాల పాటు అక్కడే ఉండి.. ఆ తర్వాత ఆయన వెళ్లాల్సిన ఈవెంట్‌కు వెళ్లి.. విద్యార్థులతో ముచ్చటించారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
- Advertisement -