Saturday, February 22, 2025

చిరంజీవి మాతృమూర్తి అస్వస్థత.. నిజం ఇదే!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి అంజనమ్మ అస్వస్థతకు గురయ్యారు అంటూ సోషల్‌మీడియాలో వార్తలు పుట్టుకొచ్చాయి. ఆమె అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు అని దీంతో ఎపి డిప్యూటి సిఎం పవన్‌కళ్యాణ్ కూడా హుటాహుటిన విజయవాడ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు అంటూ పుకార్లు చెక్కర్లు కొట్టాయి. దీంతో మెగా అభిమానులను తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదంటూ చిరంజీవి పిఆర్ టీమ్ తెలిపింది. సాధారణ ఆరోగ్య పరీక్షల కోసమే ఆమె ఆస్పత్రికి వెళ్లినట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొంది. దీంతో మెగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News