Saturday, February 22, 2025

చెలరేగిన సఫారీ బ్యాట్స్‌మెన్లు.. అఫ్గాన్ ఎదుట భారీ లక్ష్యం

- Advertisement -
- Advertisement -

కరాచీ: ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం ఆఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాట్స్‌మెట్లు చెలరేగిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా అఫ్గానిస్థాన్ ముందు 316 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. తొలి ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే సౌతాఫ్రికా ఓపెనర్ జోర్జీ(11) వికెట్‌ను కోల్పోయింది. ఈ క్రమంలో ఓపెనర్‌గా దిగిన రికెల్‌టన్ అఫ్గాన్ బౌలర్లను ఉతికేశాడు. 106 బంతుల్లో 7 ఫోర్లు 1 సిక్సుతో 103 పరుగులు చేశాడు. మరోవైపు కెప్టెన్ బవుమా కూడా రికెల్‌టన్‌కు మంచి సహకారం అందిస్తునే అర్థశతకాన్ని సాధించాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన దుస్సెన్(52) అద్భుతమైన బ్యాటింగ్‌తో సౌతాఫ్రికా స్కోర్ పెంచగా.. ఆఖర్లో మార్క్‌రం 36 బంతుల్లో 52 పరుగులతో చెలరేగిపోవడంతో సౌతాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసి అఫ్గానిస్థాన్‌కు భారీ టార్గెట్‌ను ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News