భర్త ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తన బంధువులతో కలిసి దాడి చేసిన ఘటన వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో జయింట్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న జానకీ రాం వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌద్దనగర్‌లో భార్య కళ్యాణితో కలిసి నివాసముంటున్నారు. కాగా ఇటీవల ఇంటికి రాకపోతుండటంతో నిఘా పెట్టిన ఆమె వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని గ్రహించి శుక్రవారం ఉదయం ఠాణా పరిధిలోని మధురానగర్‌లోని సదరు మహిళ నివాసానికి తన బంధువులతో కలిసి వెళ్లి అక్కడే ఉన్న తన భర్త జానకీ రాం , సదరు మహిళలపై దాడి చేసి విచక్షణారహితంగా కొట్టి తీవ్రంగా గాయపరచ్చారు. 100 డయాల్ ద్వారా సమాచారం తెలుసుకున్న వారాసిగూడ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని గాయపడిన జెసి జానకీరాం, సదరు మహిళను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
వారాసిగూడ సిఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం జానకీ రాం మెదక్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తుండేవాడని గత నాలుగు నెలల క్రితం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయానికి బదిలి అయ్యాడని, కళ్యాణి అనే మహిళను ఆరు సంవత్సరాల క్రితం రెండవ పెళ్లి చేసుకున్నాడని తెలిపాడు. కళ్యాణికి కూడ ఇది రెండవ పెళ్లని తమ ధర్యాప్తులో తేలిందన్నారు. శుక్రవారం ఉదయం 100 డయాల్ ద్వారా సమాచారం అందిందని ఈ క్రమంలో అక్కడే ఉన్న కళ్యాణీ, వారి బందువులను విచారించడం జరిగిందని, తీవ్రంగా గాయపడ్డ జానకీ రాం, సదరు మహిళను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగిందన్నారు. ప్రస్తుం వారి ఆరోగ్యం నిలకలడగా ఉందన్నారు. భార్య కళ్యాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేపడతామన్నారు. జానకీ రాం, కళ్యాణి ఇద్దరికి ఇది రెండవ వివాహంగా తెలిసింది. ఉన్నత స్థానంలో ఉన్న సదరు జానకీ రాం తన కంటే చిన్న వయస్సు ఉన్న మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని తనను నిర్లక్షం చేస్తూ ఇంటికి రావడం మానేశాడని ఈ క్రమంలోనే తన బందువులతో కలిసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు భార్య కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు.
దాడి చేసి విచక్షణా రహితంగా కొట్టిన వారిపై కేసులు పెట్టరా
కాగా జానకీ రాం భార్య కళ్యాణి తన బంధువులతొ కలిసి సదరు మహిళ నివాసం ఉంటున్న ఇంటిపై దాడి చేసి మహిళ అని చూడకుండా కళ్యాణి తరపు బందువులు తీవ్రంగా కొట్టడాన్ని ప్రధాన మీడియా, సోషల్ మీడియా ద్వారా చుసిన నెటిజన్‌లు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడి చేసిన వారిపై కూడ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తీవ్ర గాయాలపాలైన జెసి జానకీ రాం, సదరు మహిళ దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. దాడి చేసిన వారే పోలీస్ స్టేషన్‌లో హల్‌చల్ చేస్తూ హడావిడి చేయడం విష్మయానికి గురి చేస్తున్నది.
ఏ కుటుంబంలోనైనా ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటే పెద్ద మనుషులుగా ఇరువురికి సర్దిచెప్పి వారి కాపురాన్ని నిలబెట్టాల్సింది పోయి ఇలా వారే విచక్షణా రహితంగా కక్షసాధింపు దోరణిలో కొట్టడమే కాకుండా భయబ్రాంతులకు గురి చేసే విధంగా వ్యవహరించడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని దాడులు చేసిన వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఎవరో 100కు డయాల్ చేయడం ద్వారా సకాలంలో పోలీసులు అక్కడికి చేరుకొని వారి ప్రాణాలను కాపాడారు. ఒక వేళ 100కు డయాల్ చేయకుండా ఉంటే వారి ప్రాణాలు గాలిలో కలిసి పోయేవని పలువురు అభిప్రాయపడుతున్నారు.