Saturday, February 22, 2025

మా అమ్మ ఆరోగ్యంగా ఉన్నారు:చిరంజీవి

- Advertisement -
- Advertisement -

మా అమ్మ అంజనాదేవి క్షేమంగానే ఉన్నారు. ఆమె అస్వస్థతకు గురయ్యారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు”అని మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి అంజనాదేవి ఆరోగ్యం మీద సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ వార్తలను మెగాస్టార్ చిరంజీవి ఖండించారు. మా అమ్మ ఆరోగ్యం బాగా లేదని, హాస్పిటల్‌లో చేర్పించామని కొన్ని వార్తలు నా దృష్టికి వచ్చాయి. రెండు రోజులుగా ఆమె ఒంట్లో కాస్త నలతగా మాత్రమే ఉంది. ప్రస్తుతం ఆమె క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారు. మా అమ్మ ఆరోగ్యం గురించి ఎలాంటి ఊహాజనిత వార్తలను మీడియా ప్రచురించొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. అవాస్తవాలు ప్రచారం చేయవద్దు” అని చిరంజీవి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News