- Advertisement -
జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (జిహెచ్‌ఐఎఎల్) శుక్రవారం ఇండిగో ఎయిర్‌లైన్స్‌తో కలిసి హైదరాబాద్ నుంచి మదీనాకు కొత్త విమాన సేవలను ప్రారంభించింది. తొలి విమానం జిహెచ్‌ఐఎఎల్ సీనియర్ అధికారుల సమక్షంలో బయలుదేరింది. ఈ సేవలు ప్రతి వారం మూడు రోజులు- సోమవారం, గురువారం, శనివారం అందుబాటులో ఉంటాయి. ప్రయాణ సమయం 5 గంటలు 47 నిమిషాలు ఉంటుంది. ఈ కొత్త సేవతో అంతర్జాతీయ కనెక్టివిటీ మరింత మెరుగవుతుంది. ఈ సందర్భంగా జిహెచ్‌ఐఎఎల్ సిఇఒ ప్రదీప్ పనికర్ మాట్లాడుతూ, మదీనాకు ఇండిగో తొలి విమానాన్ని స్వాగతించడం ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు.
- Advertisement -