Sunday, February 23, 2025

కమ్యూనిస్టులను కూల్చడానికి అమెరికా నిధులు

- Advertisement -
- Advertisement -

1959లో కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని
పడగొట్టడానికి కుట్ర అప్పట్లో
కాంగ్రెస్‌కు నిధులు అందించిన అమెరికా
బయటపెట్టిన అమెరికా మాజీ రాయబారులు

న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడుగా బైడెన్ ఉన్నప్పు డు ఆయన నిర్వహణ లోని నిధుల సంస్థలు భా రత ఎన్నికల ప్రక్రియలో కీలకపాత్ర వహించా యా? అలా జరిగిందని ప్రస్తుత అధ్యక్షుడు డొనా ల్డ్ ట్రంప్ అభియోగాలు మోపడం వివాదాల దు మారం రేపుతున్న సంగతి తెలిసిందే. దేశం లోని కాంగ్రెస్, బీజేపీ కూడా దీనిపై పరస్పర ఆరోపణ లు చేసుకుంటున్నాయి. ఈ నిధుల వ్యవహారంపై పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. మరోవైపు ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార సమయంలో విదేశీ శక్తులు పనిచేస్తున్నాయని ఎప్పుడో చెప్పారని బీజేపీ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌లో కమ్యూనిస్టు పార్టీ పురోగతిని నివారించడాని కి అమెరికాకు చెందిన సిఐఎ సంస్థ కాంగ్రెస్ పా ర్టీకి నిధులు చెల్లించిందని గతంలో భారత్‌లో అమెరికా రాయబారులుగా పనిచేసిన ఇద్దరు దౌత్యవేత్త లు బయటపెట్టారు.

వీరిలో ఒకరు ఈ విషయా న్ని తన జ్ఞాపకాల చరిత్రలో రాసుకున్నారు. కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో కమ్యూనిస్టు ఎదుగుదల ను అడ్డుకోడానికి అమెరికా భారత్ లోని కాంగ్రెస్ పార్టీకి నిధులు అందించిందని రాసుకున్నారు. అ మెరికా అధ్యక్షుడుగా ఐసెన్‌హోవెర్ (1951 1953) పాలన సాగించిన కాలంలో కేరళ లోని క మ్యూనిస్టు పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కాం గ్రెస్‌కు నిధులు అందినట్టు ఆరోపించారు. భారత్‌లో కేరళనే అమెరికా ఎందుకు గుర్తించింది ? అ ని ప్రశ్నించుకుంటే అప్పటికి దేశం మొత్తం మీద కేరళ లోనే కాంగ్రెసేతర పార్టీ ప్రభుత్వం కేరళ లోనే ఏర్పడింది. 1957లో
దేశంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం కేరళ లోనే ఏర్పాటైంది. ఇఎంఎస్ నంబూద్రిపాది నేతృత్వంలో కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. ఇది చాలా అరుదైన విషయం. అమెరికా, చైనా దేశాలకు అవతల మరో దేశంలో కమ్యూనిస్టు పట్టు సాధించడం అమెరికాకు ఆందోళన కలిగించింది. అది కూడా ప్రజాస్వామ్య పద్ధతి లోనే ఏర్పాటు కావడం అమెరికాకు మరీ అబ్బురపరిచింది.

అమెరికా లోనూ, ప్రపంచ దేశాల్లోనూ కమ్యూనిస్టు పార్టీ విస్తరించకుండా అమెరికా ప్రభుత్వం పోరాటం సాగిస్తున్న కాలంలో కేరళ కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం అమెరికాలో కలవరం కలిగించింది. ఆనాడు కమ్యూనిస్టు ప్రభావ భయంతో సోవియట్ యూనియన్‌తో అమెరికా ప్రచ్ఛన్న యుద్ధం ( కోల్డ్ వార్ ) సాగిస్తోంది. మరో ఉదాహరణ ఇరాన్‌లో 1953 లో అప్పటి ప్రధాని మొహమ్మద్ మొసద్దేఘ్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కూడా ఆపరేషన్ అజాక్స్‌కు సిఐఎ నిధులు అందించింది. మొసద్దేఘ్ ప్రభుత్వంపై కమ్యూనిస్టు టుడే పార్టీ ప్రభావం ఉందని అమెరికా భయపడింది. ఫలితంగా ఇరాన్ షాను అమెరికా బలోపేతం చేసింది. షాకు అనుకూలంగా ఉండడం వెనుక బ్రిటన్ లోని చమురుప్రయోజనాలు కూడా ఉన్నాయి. 1959 లో కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని అస్థిర పర్చడానికి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సిఐఎ) , యునైటెడ్ స్టేట్స్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (యుఎస్‌ఐఎస్) కలిసి కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే వ్యవహారం ఇప్పుడు మళ్లీ తెరపైకి రావడం భారత రాజకీయాల్లో అనూహ్య పరిణామాలకు దారి తీయవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News