- Advertisement -
భూపాలపల్లి జిల్లాలోని పలువురు రైతుల బ్యాంకు ఖాతాల్లో ఖరీఫ్ ధాన్యం బోనస్‌ను ప్రభుత్వం శుక్రవారం రాత్రి జమ చేసింది. రాత్రి 8.38 గంటల సమయంలో సెల్‌ఫోన్లకు డబ్బులు జమ అయినట్లు మెసేజ్‌లు రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. జిల్లాలో అర్హులైన రైతులకు ఇవ్వాల్సిన రూ.40 కోట్లకు గాను మొన్నటివరకు రూ.8 కోట్లు మాత్రమే ప్రభుత్వం చెల్లించింది. గురువారం రాత్రి కొంతమంది రైతులకు బోనస్ జమ అయ్యింది. ఎంతమంది రైతులకు జమ అయ్యాయో తెలియాల్సి ఉంది.
- Advertisement -