నేడు ఆసీస్‌తో ఇంగ్లండ్ పోరు
లాహోర్: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా శనివారం జరిగే గ్రూప్‌బి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థులు ఇంగ్లండ్‌ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. లాహోర్ ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది. కీలక ఆటగాళ్లు దూరం కావడంతో ఆస్ట్రేలియా కాస్త బలహీనంగా మారింది. అయితే ఎలాంటి పరిస్థితి ఎదురైన తట్టుకుని ముందు కు సాగే సత్తా ఆస్ట్రేలియాకు ఉందని చెప్పాలి. ఈ మ్యాచ్‌లో సర్వం ఒడ్డేందుకు ఇతర ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు.
మాథ్యూ షార్ట్, ట్రా విస్ హెడ్, జాక్ ఫ్రేజర్, కెప్టెన్ స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లిస్, ఆరోన్ హార్డి, సీన్ అబాట్, మాక్స్‌వెల లబుషేన్, అలెక్స్ కెరీ, జంపా వంటి ప్రతిభావంతులు జట్టులో ఉన్నారు. దీంతో ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. ఇక ఇంగ్లండ్ కూడా బలంగా కనిపిస్తోంది. కెప్టెన్ జోస్ బట్లర్ జట్టును ముం దుండి నడిపించేందుకు సిద్ధమయ్యాడు. ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జేమీ స్మిత్, హ్యారి బ్రూక్, జో రూట్, లివింగ్ స్టోన్, రషీద్, వుడ్ వంటి మ్యాచ్ విన్నర్లు జట్టులో ఉన్నారు. ఇరు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.