- Advertisement -
విజయ్ కనకమేడల దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ’భైరవం’. ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతిలాల్ గడా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. శుక్రవారం మేకర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భైరవం థీమ్ సాంగ్‌ను విడుదల చేశారు.
ఫిబ్రవరి 26న రానున్న మహా శివరాత్రి శుభ సందర్భంగా విడుదలైన ఈ పాట ఆధ్యాత్మిక శక్తితో అదిరిపోయింది. చైతన్య ప్రసాద్ రాసిన సాహిత్యం… శివుని దైవిక సారాన్ని అందంగా చూపించింది. ఈ పాటకు శంకర్ మహదేవన్ అద్భుతమైన గాత్రాన్ని అందించారు. ఈ పాటలో బెల్లంకొండ శ్రీనివాస్ శివ తాండవం చేస్తూ మైమరపించారు. భైరవం సినిమా సమ్మర్ థియేట్రికల్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది.
- Advertisement -