Sunday, February 23, 2025

హోమో సెక్స్‌కు నో చెప్పడంతో ప్రాణం తీశాడు

- Advertisement -
- Advertisement -

సిద్ధిపేట: హోమోసెక్స్‌కు ప్రతిఘటించడంతో ఓ వ్యక్తిని మరో వ్యక్తి హత్య చేశాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కరీంనగర్ జిల్లా రేకుర్తి గ్రామం బుడిగె జంగాల కాలనీకి చెందిన పర్యతం రాజు అనే వ్యక్తి, సిద్దిపేటలోని కెసిఆర్ నగర్‌కు చెందిన బోదాస్ శ్రీనివాస్‌తో స్నేహం చేసేవారు. పర్వతం రాజు గత కొన్ని రోజులుగా భార్యతో గొడవ పడి వేరుగా ఉంటున్నాడు. ఫిబ్రవరి 19వ తేదీన రాజుకు శ్రీనివాస్ కనిపించగా మద్యం తాగుదామని నిర్మాణంలో ఉన్న భవనంలోకి వెళ్లారు.

ఇద్దరు పూటుగా మద్యం తాగిన అనంతరం శ్రీనివాస్ స్పృహతప్పి పడిపోయాడు. అదే సమయంలో రాజు అతడితో హోమో సెక్స్ చేయడానికి ప్రయత్నించాడు. శ్రీనుకు మెలుకువ రాగానే రాజును ప్రతిఘటించాడు. శ్రీనివాస్ తలపై రాజు కర్రతో బలంగా కొట్టి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి అతడు పారిపోయాడు. శ్రీనివాస్ భార్య సంధ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిద్దిపేట బస్టాండ్ సమీపంలో రాజు అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో అనుమానంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. వెంటనే అతడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. కరీంనగర్‌లో రాజుపై పలు కేసులు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News