తిరుపతి: పుత్రులు లేకపోవడంతో కన్న కూతురు కుమారుడిగా మారి కన్న తల్లికి దహన సంస్కారాలు నిర్వహించింది. ఈ సంఘటన తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి ప్రాంతం ఏర్నేడు మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…. పంగూరులో సుబ్బారామయ్య, పుల్లమ్మ అనే దంపతులు నివసించేవారు. ఈ దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తండ్రి చనిపోవడంతో వాళ్ల భారం తల్లిపై పడింది. పుల్లమ్మ పని చేసి ఆడ పిల్లలను చదివించుకుంది.
చిన్న కుమార్తె భారతీ పీలేరులో టీచర్‌గా పని చేస్తున్నారు. అనారోగ్య సమస్యలతో తల్లి చనిపోవడంతో చిన్న కుమార్తె భారతి దహన సంస్కారాలు నిర్వహించింది. తల్లికి తలకొరివి చిన్న కూతురు భారతి రుణం తీర్చుకుంది. దీంతో భారతిని గ్రామస్థులు ప్రశంసిస్తున్నారు. కుమారులు లేని లోటు పూడ్చిందని ఆమెను కొనియాడారు. కంటే కూతురినే కనాలని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పున్నామి నరకం నుండి రక్షించే వాడు పుత్రుడే కాదు పుత్రిక అని పలువురు కామెంట్లు చేస్తున్నారు.