హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే బంగ్లాదేశ్‌పై భారత జట్టు ఘన విజయం సాధించింది. బుమ్రా లేకపోవడంతో భారత జట్టుకు పెద్ద లోటు అని క్రికెట్ పండితులు వాపోతున్నారు. బుమ్రా సతీమణి సంజనా గణేశన్ ప్రజెంటర్ ఛాంపియన్స్ ట్రోఫీలో విధులు నిర్వహిస్తున్నారు. బంగ్లాదేశ్ ఆటగాడు మెహిదీ హసన్ మిరాజ్‌తో సంజనా మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మిరాజ్: ప్రపంచంలో ఇతర బౌలర్లతో పోలిస్తే ప్రత్యేకమైన, అత్యంత ప్రమాదకారమైన బౌలర్ బుమ్రా, టెస్టు మ్యాచ్ లో అతడిని ఎదుర్కొవడం కష్టంగా ఉంది. రెండు వైపులా స్వింగ్ చేయగలడు.
సంజనా: మా ఆయన ఇక్కడికి రావడంలేదు
మిరాజ్: అవును నాకు తెలుసు, బుమ్రా లేకపోవడం చాలా సంతోషం, ఆయన ఎలా ఉన్నాడు?
సంజనా: బుమ్రా ఎన్‌సిఎలో శిక్షణ తీసుకుంటున్నాడు
మిరాజ్: బుమ్రా అంటే ప్రతి ఒక్కరు గౌరవిస్తాం, త్వరగా కోలుకొని రావాలని ఆకాంక్ష