Sunday, February 23, 2025

కోడి పుంజుల ప్రభాకర్ పై విచారణ?

- Advertisement -
- Advertisement -

అమరావతి: డిఎస్పిగా అధికార దుర్వినియోగం చేశారని పోలీస్ అధికారి ప్రభాకర్ బాబుపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆరోపణలు చేసింది.  పలు అభియోగాలతో అడిషనల్ ఎఎస్పి ప్ర్రభాకర్ బాబుపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. సిబ్బందితో సహా పలువురిని ఇబ్బందులకు గురిచేసినట్టు విమర్శలు రావడంతో అతడిపై యాక్షన్ తీసుకోవాలని ఎపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అతడిపై వచ్చిన అభియోగాలపై 15 రోజులల్లో వివరణ ఇవ్వాలని ప్రభాకర్ బాబుకు ఎపి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఎఎస్పి ప్రభాకర్ బాబు సెలవులో ఉన్నాడు.

టిటిడి కేటాయించిన వసతి గృహంలో ఎఎస్పి ప్రభాకర్ బాబు నివసించేవారని, అందులో కోడిపుంజులను పెంచేవారని, యాత్రికులకు కేటాయించిన కాటేజీల మధ్యలో ఉండటంతో రాత్రి వేళ ఆ కోళ్ల అరుపుల శబ్దాలు, వాటి విసర్జితాల దుర్వాసనకు యాత్రికులకు సరిగ్గా నిద్రపట్టేది కాదని, వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారని, ఎఎస్పి ప్రభాకర్ బాబుపై టిటిడి శుక్రవారం అభియోగాలు మోపిన విషయం తెలిసిందే. కానిస్టేబుళ్ల సహాయంతో కోడి పుంజులను పెంచాడని అభియోగాలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News