హైదరాబాద్: ఛాంపియన్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. ఆదివారం పాకిస్తాన్‌తో టీమిండియా ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు అద్భుతమైన బ్యాట్స్‌మెన్లు అని వారికి ఫామ్‌తో సంబంధంలేదన్నారు. వన్డేలలో ఇద్దరు మ్యాచ్ విన్నర్లు అని ప్రశంసించారు. ఇద్దరు కుదురుకుంటే పాక్ ప్రమాదమేనని వ్యాఖ్యానించారు.
బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ దూకుడుగా ఆడాడని, పాక్ తో జరిగే మ్యాచ్‌లో దూకుడుగా ఆడుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. పాక్‌పై రోహిత్ 60 బంతుల్లో శతకం కొట్టగలడని ధీమా వ్యక్తం చేశాడు. ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే ఫోర్లు, సిక్స్‌లు వాటంతట అవే వస్తాయన్నారు. షార్ట్ ఫిచ్ బంతులను ఆడటంలో రోహిత్ మించిన వారు లేడని యువీ కొనియాడారు. 145 నుంచి 150 కిలో మీటర్ల వేగంతో వచ్చే బంతులను ఈజీగా ఆడుతాడని, తేలికగా హుక్ చేసి బౌండరీ తరలించడంలో రోహిత్ దిట్ట అని, ఒంటి చేత్తో మ్యాచ్‌ని గెలిపించే సత్తా అతడికి ఉందని యువీ మెచ్చుకున్నారు.