వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైమానిక దళం జనరల్ సిక్యు బ్రౌన్‌కు సంయుక్త దళాల అధిపతుల చైర్మన్ పదవిలో నుంచి శుక్రవారం ఉద్వాసన పలికారు. శ్రేణుల్లో విభిన్నతను, సమానత్వాన్ని సమర్థించే నాయకులను మిలిటరీ నుంచి వదిలించుకునే కార్యక్రమంలో భాగంగా బ్రౌన్‌ను ట్రంప్ తొలగించారు. బ్రౌన్ చరిత్ర సృష్టించిన ఫైటర్ పైలట్‌గా, గౌరవనీయ అధికారిగా ఖ్యాతి గడించారు. చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన రెండవ బ్లాక్ జనరల్ అయిన బ్రౌన్‌కు ఉద్వాసన పలకడం పెంటాగన్‌కు షాక్ కలిగించేదే. బ్రౌన్ 16 నెలల పదవీ కాలం ఉక్రెయిన్‌లో యుద్ధం, మధ్య ప్రాచ్యంలో కొనసాగుతున్న వివాదంతోనే గడచిపోయింది. ‘మన ప్రస్తుత సంయుక్త దళాల అధిపతుల చైర్మన్‌గా కూడా మన దేశానికి 40 ఏళ్లకు పైగా సేవ చేసినందుకు జనరల్ చార్లెస్ సిక్యు బ్రౌన్‌కు ధన్యవాదాలు తెలపాలని అనుకుంటున్నాను.
ఆయన చక్కటి మర్యాదస్థుడు, విశిష్ట నేత. ఆయనకు, ఆయన కుటుంబానికి గొప్ప భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తున్నాను’ అని ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. తదుపరి చైర్మన్‌గా ఎయిర్ ఫోర్స్ లెఫ్టినెంట్ జనరల్ డాన్ ‘రజిన్’ కెయిన్‌ను నియమిస్తున్నానని ట్రంప్ తెలిపారు. కాంగ్రెస్‌లోని కీలక సభ్యుల్లో బ్రౌన్‌కు మద్దతు ఉన్నప్పటికీ, డిసెంబర్ మధ్యలో ఆయనతో స్నేహపూర్వక సమావేశం అయినప్పటికీ ట్రంప్ ఈ చర్య తీసుకోవడం గమనార్హం. ఆర్మీ నేవీ ఫుట్‌బాల్ గేమ్ సమయంలో ట్రంప్, బ్రౌన్ ఇద్దరు పక్కపక్కనే ఆశీనులయ్యారు, కేవలం నాలుగు వారాల క్రితం పెంటాగన్ టాప్ పదవిని చేపట్టిన రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెథ్‌తో బ్రౌన్ క్రమం తప్పకుండా భేటీ అవుతున్నారు.