Sunday, February 23, 2025

ఆరుగురు బందీలను విడిచిపెట్టిన ఇజ్రాయెల్

- Advertisement -
- Advertisement -

నుసెయిరాత్(గాజా స్ట్రిప్): తాజా మార్పిడిలో భాగంగా ఆరుగురు ఇజ్రాయెల్ బందీలను హమాస్ శనివారం విడుదలచేసింది. వందలాది పాలస్తీనీయుల ముందు హమాస్ సాయుధ యోధులు గాజాలో రెండు వేర్వేరు వేడుకల్లో ఆ ఐదుగురు బందీలను రెడ్‌క్రాస్ వారికి అప్పగించారు. కేంద్ర పట్టణమైన నుసెయిరాత్‌లో 20 ఏళ్ల వయసున్న ముగ్గురు ఇజ్రాయెల్ దేశస్థులు ఒమర్ వెంకర్ట్, ఒమర్ షెమ్ టోవ్, ఎలియా కోహెన్ హమాస్ యోధుల పక్కన ఫోటోలకు ఫోజులిచ్చారు. కాగా ఒమర్ షెమ్ టోవ్ జనసమూహానికి గాలిలో ముద్దులు వదిలాడు. తన బొటన వేలను పైకెత్తి(థమ్స్ అప్) చూయించాడు.

అంతేకాక తన పక్కన ఉన్న హమాస్ మిలిటెంట్ తలని ముద్దాడాడు. వారి విడుదల సందర్భంగా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆ ముగ్గురిని రెడ్ క్రాస్ వాహనంలోకి ఎక్కించి ఇజ్రాయెల్‌కు పంపించారు. దక్షిణ గాజాలోని రఫా పట్టణంలో మరో ఇద్దరు ఇజ్రాయెల్ బందీలను విడుదలచేశారు. కాగా ఆరో బందీ అయిన 36 ఏళ్ల హిషామ్ అల్‌సయెద్‌ను కూడా చివరికి విడుదలచేశారు. బందీల విడుదల మార్పిడిలో భాగంగా ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న 600 మంది పాలస్తీనీయులను కూడా విడుదల చేయనున్నది. ఇదిలావుండగా గాజా నుంచి 20 లక్షల మంది పాలస్తీనీయులను తొలగిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటున్నారు.

ఈ ప్రతిపాదనను నెతన్యాహు ఆహ్వానించినప్పటికీ, ప్రపంచ దేశాలు తిరస్కరించాయి. ‘నా ప్లాన్ ఏమిటో తెలుపుతాను, వాస్తవానికి నా ప్లాన్ పనిచేయగలదు. కానీ నేను బలప్రయోగం చేయబోను, సిఫార్సు మాత్రం చేస్తాను’ అని ట్రంప్ ఇటీవల ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వూలో పేర్కొన్నారు. ఇజ్రాయెల్ దాడులు గాజా ప్రాంతంలో చాలా వరకు విధ్వంసాన్ని సృష్టించింది. ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటి వరకు 48000 మంది పాలస్తీనీయులను చంపేసింది. వారిలో చాలా వరకు మహిళలు, పిల్లలే ఉన్నారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరిగిన యుద్ధం కారణంగా 90 శాతం మంది పాలస్తీనీయులు నిరాశ్రయులయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News