Sunday, February 23, 2025

నాడు దివ్యంగా ఉన్న రాష్ట్రం.. నేడు దివాళా

- Advertisement -
- Advertisement -

కెసిఆర్ పాలనలో తెలంగాణలో అద్భుత ప్రగతి..కాంగ్రెస్ పాలనలో అధోగతి
దమ్ముంటే ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలి భట్టి విడుదల చేసిన
అట్లాస్ నివేదికే బిఆర్‌ఎస్ పాలనకు అద్ధం పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో
రాష్ట్రం నెంబర్‌వన్‌గా ఉందని మీ నివేదికే చెబుతున్నది రేవంత్ చేతగాని
తనంతో ఏడాదిలోనే అన్ని రంగాలు కుదేలు సొంత రాష్ట్రానికి క్యాన్సర్
వచ్చిందని చెప్పిన దివాళాకోరు సిఎం రేవంత్ ఒక్కరే : కెటిఆర్ ఫైర్

మన తెలంగాణ/హైదరాబాద్ : కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దివ్యంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం, రేవంత్ రెడ్డి పాలనలో దివాళా తీసిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించా రు. మోడీ తలకిందులుగా తపస్సు చేసినా, రా హుల్ గాంధీ వంద జోడో యాత్రలు చేసినా కెసిఆ ర్ లెక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేరని అన్నారు. తెలంగాణ ఆర్థిక ప్రగతిపై అసెంబ్లీలో చర్చకు సి ద్ధం అని, దమ్ముంటే కాంగ్రెస్ పాలనపై అసెంబ్లీ లో చర్చ పెట్టాలని కెటిఆర్ సిఎం రేవంత్‌రెడ్డికి స వాల్ చేశారు. నాలుగు కోట్ల ప్రజల ముందు.. అసెంబ్లీ సమావేశాల్లోనే రేవంత్‌రెడ్డి బట్టలు విప్పుతామన్నారు. తమ పార్టీ సభ్యుల సంఖ్యకు అనుగుణంగా సరిపడే సమయం ఇస్తే అసెంబ్లీలోని రేవం త్ రెడ్డి దుమ్ము దులుపుతామని పేర్కొన్నారు. ఇది తమ సవాల్ అని, రేవంత్ రెడ్డికి దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలని చెప్పారు. తెలంగాణ భ వన్‌లో శనివారం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి కెటిఆర్ మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సం దర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, సిఎం రేవంత్‌రెడ్డి తన చేతగానితనంతో కేవలం ఒక్క సంవత్సరంలోనే అన్ని రంగాలను చావుదెబ్బ కొట్టారని విమర్శించారు. ఇది రాష్ట్ర ఆర్థిక లోటు కాదు.. రేవంత్ రెడ్డి వల్ల వచ్చిన తలపోటు అని పేర్కొన్నారు. రా ష్ట్రంలో కొత్త నిర్మాణాల పైన ఒక్క స్క్వేర్ ఫీట్‌కు 150 రూపాయలు వసూలు చేస్తున్నారని, అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి తెలంగాణ ది వాలా తీస్తుందని ఒకటే తీరుగా ప్రచారం చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి, మంత్రులు తెలంగాణ నాశనమైందని చెబుతూ వస్తున్నారని, తన సొంత రాష్ట్రానికి క్యాన్సర్ వచ్చిందని చెప్పిన దివా ళా కోరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కరే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అనేటోడు ఇన్ని పచ్చి అబద్ధాలు చెప్తాడని ఎవరు అనుకోరని కెటిఆర్ పేర్కొన్నారు. కానీ సిఎం రేవంత్ రెడ్డి చెప్పిన అబద్ధాలను డిప్యూటీ సిఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఎండగట్టి ఉతికి ఆరేశారని తెలిపారు.

రేవంత్ రెడ్డి చెప్తున్నవి అబద్దాలని భట్టి విక్రమార్క ఫిబ్రవరి 17 నాడు ఒక సమగ్ర నివేదిక(తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్‌స్ట్రాక్ట్.. అట్లాస్)ను విడుదల చేశారని చెప్పారు. పదేండ్ల బిఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా ఉన్నట్టు ప్రభుత్వం విడుదల చేసిన నివేదికనే చెబుతుందని పేర్కొన్నారు. తాము దిగిపోయేనాడు ఉన్న రేషన్ కార్డుల సంఖ్య 89 లక్షల 97 వేలు అని భట్టి విక్రమార్కనే చెప్పారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష కార్డులు తొలగించారని చెప్పారు. కొత్తవి ఇవ్వకుండా ఉన్నవి తొలగించారని అన్నారు.అది రాష్ట్ర ప్రభుత్వం సాధికారికంగా విడుదల చేసిన నివేదిక అని, రేవంత్ రెడ్డి చెప్పిన అబద్ధాలను తిప్పికొడుతూ, సమగ్రమైన నివేదిక ఇచ్చినందుకు భట్టి విక్రమార్కకు కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసుకోకుండా సిఎం ఏది పడితే అది మాట్లాడి తెలంగాణ పరువు తీస్తున్నారని మండిపడ్డారు. కెసిఆర్‌కు మంచి పేరు వస్తుందని తెలుసుకుని వెబ్‌సైట్ నుంచి ఆ నివేదికను తొలగించారని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇన్ని రోజులు కాంగ్రెస్ నేతలు చెప్పినవన్నీ పచ్చి అబద్దాలని
ఈ నివేదికతో తెలుస్తుందని తెలిపారు. తలసరి ఆదాయంలో 2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో 10వ స్థానంలో ఉండగా, 2023 నాటికి తలసరి ఆదాయంలో భారత దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో తెలంగాణ ఉందని ఈ నివేదిక చెబుతుందని వెల్లడించారు. 2014- 15లో దేశ తలసరి ఆదాయం సగటు 86,000 ఉంటే తెలంగాణ తలసరి ఆదాయం 1,24,000 ఉండేదని, ఈ నివేదిక ప్రకారం భారతదేశం మొత్తం సగటు కంటే తెలంగాణ తలసరి ఆదాయం సగటు రెండు రెట్లు ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణలో సంపద ఎలా పెరిగింది.. ?.. ఎలా అభివృద్ధిలో పురోగమించింది..?…ఎలా దేశానికి ఆదర్శంగా మారిందో ఈ నివేదిక స్పష్టం చేసిందని వ్యాఖ్యానించారు.

అట్లాస్ నివేదిక వాస్తవాలను బయటపెట్టింది
తెలంగాణ దివాలా తీసింది అని దివాళాకోరు మాటలు మాట్లాడిన సన్నాసుల నోర్లు మూయించే విధంగా ఈ నివేదిక వాస్తవాలను బయటపెట్టిందని కెటిఆర్ అన్నారు. తలసరి ఆదాయంలో మాత్రమే కాదు జిడిపిలో భారతదేశానికి కాంట్రిబ్యూటర్‌గా దేశానికి ఏ విధంగా అన్నం పెడుతుందో ఈ నివేదిక చెబుతుందని పేర్కొన్నారు. ప్రగతిశీల విధానాలతో, కులం మతం పంచాయతీలు లేకుండా తెలంగాణ ఎలా పురోగమించిందో, ఎట్లా సంపద సృష్టించిందో ఈ నివేదిక తెలియజేస్తుందని తెలిపారు. 2013 -14లో భారతదేశ జిడిపిలో తెలంగాణ వాటా నాలుగు శాతంగా ఉంటే, కెసిఆర్ ముఖ్యమంత్రిగా దిగిపోయే సమయానికి అది పెరిగి 5.1 శాతంగా ఉందని నివేదిక స్పష్టం చేసిందని వివరించారు.

తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న దానికంటే తెలంగాణ రాష్ట్రమే కేంద్రానికి రెట్టింపు ఆదాయాన్ని ఇస్తుందని చెప్పారు. కెసిఆర్ నాయకత్వంలో సొంత ఆదాయ వనరులతో కేంద్రం మీద ఆధారపడకుండా, ఇతరుమల ముందు చేయి చాపకుండా తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన నిలబడిందని ఆర్‌బిఐ నివేదిక తెలిపిందని వెల్లడించారు. ఆర్‌బిఐ నివేదిక ప్రకారం కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పది సంవత్సరాల కాలంలో స్టేట్ ఓన్డ్ టాక్స్ రెవిన్యూలో భారతదేశంలోనే 88 శాతం సొంత ఆదాయ వనరులతో కేంద్రం మీద ఆధారపడకుండా తెలంగాణ అగ్రభాగాన నిలబడిందని వ్యాఖ్యానించారు. ఈ నివేదిక ప్రకారం జిఎస్‌డిపిలో తెలంగాణ స్థానం 2014లో ఐదు లక్షల కోట్లు అని, కానీ భట్టి విక్రమార్క విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ రాష్ట్రం జిఎస్‌డిపిని కెసిఆర్ పదేళ్లలో ఐదు లక్షల కోట్ల నుంచి 15 లక్షల కోట్లకు పెరిగిందని చెప్పారు. జిఎస్‌డిపిలో తెలంగాణ గుజరాత్ కంటే మెరుగైన స్థితిలో ఉందని అన్నారు.

నేను చెప్పినవి తప్పని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం
తాను చెప్పినవి తప్పని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం అని కెటిఆర్ వెల్లడించారు. మిత్తీలకు పోయిన పది నెలలకు 22 వేల 56 కోట్లు కట్టినట్లు నివేదికలో పేర్కొన్నారు. నెలవారీ లెక్క కూడా ఇందులో ఇచ్చారు.. నెలకు పోయిన ఏప్రిల్ నుంచి మొన్న జనవరి వరకు 22 వేల 56 కోట్లు. అంటే నెలకు 2200 కోట్లు అని భట్టి విక్రమార్క చెబుతుండు. మరి నెలకు 6500 కోట్లు కడుతున్నాని బోగస్ ముఖ్యమంత్రి చెబుతుండు. 4300 కోట్లు ఎక్కడ పోతున్నాయి. టకీటకీమని రైతుబంధు పడుతలేదు. తులం బంగారం వస్తలేదు.. టకీటకీమని రాహుల్ గాంధీ ఖాతాలో పడుతున్నాయో చూడాలి అని కేటీఆర్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై చిల్లర మాటలు వారికి ఈ నివేదికలో స్పష్టమైన సమాధానం ఉందని అన్నారు. కాళేశ్వరం,మిషన్ కాకతీయ లాంటి సాగునీటి పథకాలతో పాటు రైతుబంధు లాంటి సంక్షేమ పథకాలతోనే సంపద పెరిగిందని ఈ నివేదిక చెబుతుందని తెలిపారు.

2014 సంవత్సరంలో 34 లక్షల ఎకరాల్లో వరి పంట సాగయ్యేదని, 68 లక్షల టన్నుల వరి దిగుబడి జరిగేదని, కెసిఆర్ ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి ఒక కోటి 18 లక్షల ఎకరాల్లో వరి సాగు ఉండేదని, రెండు కోట్ల 60 లక్షల టన్నుల వరి దిగుబడి అయ్యేదని వివరించారు. కాళేశ్వరం, మిషన్ కాకతీయ పథకాలు తెలంగాణలో వ్యవసాయ విస్తరణకు దోహదపడ్డాయో ఈ గణాంకాల ద్వారానే తెలుస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాటికి ఐటి ఎగుమతులు 57 వేల కోట్లు ఉంటే, 2023 నాటికి రెండు లక్షల 41 వేల కోట్లకు పెరిగాయని, ఐటి రంగంలో 3,23,000 మంది ఉద్యోగులు 2014లో ఐటీ రంగంలో పనిచేసేవారని, బిఆర్‌ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి మూడు రెట్లు ఎక్కువగా పది లక్షల మంది ఉద్యోగులు ఐటి రంగంలో పనిచేస్తున్నారని తెలిపారు. బిసిలను బలోపేతం చేసే కెసిఆర్ చర్యలను కూడా చిల్లర మాటలు మాట్లాడి కాంగ్రెస్ నేతలు తక్కువ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ,పరిశ్రమల విస్తరణతో పాటు నాణ్యమైన సరఫరా కారణంగా గృహాలలో విద్యుత్ వినియోగం పెరగడంతోనే ఇది సాధ్యమైందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పారిశ్రామిక విస్తరణ అద్భుతంగా ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం నివేదికనే స్పష్టం చేసిందని తెలిపారు.

కెసిఆర్ మొక్కవోని పట్టుదలతో తెలంగాణలో అభివృద్ధి యజ్ఞం చేశారు
దేశ జనాభాలో 2.8 శాతంగా ఉన్న తెలంగాణ 5.1 శాతం సంపదను దేశానికి అందిస్తుందని కెటిఆర్ తెలిపారు. కెసిఆర్ నాయకత్వంలో పదేళ్లపాటు సంపద సృష్టించడంలో తమ ప్రభుత్వం అద్భుతంగా పనిచేసిందన్నది వాస్తవం అని వ్యాఖ్యానించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ తలకిందులుగా తపస్సు చేసినా.. రాహుల్ గాంధీ మరో వంద జోడోయాత్రలు చేసినా.. కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణలో గత పదేండ్లలో జరిగిన అభివృద్దిని సాధించలేరని తేల్చిచెప్పారు. గత పదేళ్లు కెసిఆర్ మొక్కవోని పట్టుదలతో తెలంగాణలో అభివృద్ధి యజ్ఞం చేశారని పేర్కొన్నారు.గడిచిన 10 నెలల కాలంలో మిత్తీల కోసం 26 వేల 56 కోట్ల రూపాయలను కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిందని, ఉన్నదాని కంటే ఎక్కువ మిత్తి కడుతున్నామని అబద్దాలు చెపుతున్న రేవంత్ రెడ్డి, ఆ పైసలు ఎవరి ఖాతాలోకి వెళ్తున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. టకి టకీ మని రైతుల ఖాతాల్లో అయితే పడడం లేదని, టకీ టకీమని రాహుల్ గాంధీ ఖాతాలో

పడుతున్నాయో లేదో చూడాలని పేర్కొన్నారు. 2014లో తెలంగాణ ఆదాయంలో వడ్డీల శాతం 21.64 కాగా, 2023 నాటికి తెలంగాణ ఆదాయంలో వడ్డీల శాతం కేవలం 17.19 శాతం అని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు కట్టిన ప్రాంతాలలో తాము ఓట్లు అడుగుతామన్న సిఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కెటిఆర్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా ఆరు గ్యారెంటీలు అమలు చేసిన దగ్గరే పోటీ చేయాలి అనవచ్చని పేర్కొన్నారు. పూర్తిస్థాయి రుణమాఫీ అయిన దగ్గర.. రైతుబంధు వచ్చిన దగ్గర ఆడబిడ్డలకు 2500 వచ్చిన దగ్గర పెంచిన పెన్షన్లు ఇస్తున్న దగ్గర మాత్రమే కాంగ్రెస్ పోటీ ఓట్లు అడగాలని అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తా అన్న దగ్గర ముఖ్యమంత్రి ఓట్లు అడగాలంటూ కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికే స్టార్టర్లు, మీటర్లు, డోర్లు ఎత్తుకపోతున్నారని, రేపు రేపు ఆడబిడ్డల పుస్తెలతాడు కూడా రేవంత్ రెడ్డి ఎత్తుకపోతారని కెటిఆర్ మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News