యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్లలో వ్యాధి
నిర్ధారణ వారం క్రితం చనిపోయిన వెయ్యి కోళ్లు
పరీక్షల్లో బర్డ్‌ఫ్లూ పాజిటివ్‌గా రావడంతో కోళ్లఫామ్‌కు సీల్
మనతెలంగాణ/యాదాద్రి భువనగిరి ప్రతినిధి: రాష్ట్రంలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. యా దాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలం, నేలపట్లలో వారం క్రితం వెయ్యి కోళ్లు మృతి చెందగా.. తాజాగా బర్డ్ ఫ్లూ పాజిటివ్‌గా నిర్ధార ణ అయింది. దీంతో ఆ గ్రామంలో పోలీసులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. గ్రామానికి 10 కి.మీ వరకు చికెన్ విక్రయాలపై ఆంక్షలు విధించా రు. చికెన్ తినే విషయంలో ప్రజలు అప్రమత్తం గా ఉండాలని సూచించారు. వివరాల్లోకి వెళ్తే.. వారం రోజుల క్రితం చౌటుప్పల్ మండలం, నేలపట్ల గ్రామంలోని ఓ కోళ్లఫామ్‌లో దాదాపు వెయ్యి కోళ్లు చనిపోయాయి. విషయం తెలుసుకున్న పశుసంవర్ధకశాఖ అధికారులు కోళ్ల శాం పిల్స్‌ను టెస్ట్‌లకు పంపించారు. తాజాగా.. ఆ కోళ్ల మృతిపై రిపోర్టులు వచ్చాయి.
ఇందులో బర్డ్ ఫ్లూ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దాంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన తొలి కేసు ఇదే కావడంతో అధికారులు అప్రమత్తమయ్యా రు. నేలపట్ల గ్రామం లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. గ్రామం నుంచి పది కిలోమీటర్ల పరిధిలో ఎవరూ కోళ్లను విక్రయించటానికి వీలు లేదని స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు.