Sunday, February 23, 2025

మంచి కథ, ఎమోషన్ ఉన్న హారర్ సినిమా శబ్దం

- Advertisement -
- Advertisement -

‘వైశాలి’తో సూపర్‌హిట్‌ని అందించిన హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్‌లు రెండోసారి మరో ఆసక్తికరమైన సూపర్‌నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ ‘శబ్దం’ కోసం చేతులు కలిపారు. 7జి ఫిలిమ్స్ శివ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సిని మా ఫిబ్రవరి 28న ఆంధ్రాలో ఎన్ సినిమాస్, నైజాంలో మైత్రి డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

నేచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా హాజరైన ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ప్రీరిలీజ్ ఈవెంట్‌లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ “శబ్ధం ఒక మం చి కథ, ఎమోషన్ వున్న హారర్ సినిమా ఇది”అని అన్నారు. హీరో ఆది పినిశెట్టి మాట్లాడుతూ “శబ్దం జర్నీ 16 ఏళ్ల క్రితం మొదలైంది. వైశాలి లేకపోతే ‘శబ్దం’ వుండేది కాదు. అది నా కెరీర్ స్పెషల్ మూవీ”అని తెలిపారు. దర్శకుడు అ రివళగన్ మాట్లాడుతూ “వైశాలి పెద్ద కమర్షియల్ హిట్ అయ్యింది.

అది వాటర్ బ్యాక్ డ్రాప్‌లో వున్న కథ. ఆది, నేను మళ్ళీ సినిమా చేయాలని అనుకున్నప్పుడు సౌండ్ ని హారర్ థీంగా తీసుకోవాలని అ నుకున్నాం. సౌండ్‌ని విజువలైజ్ చేసి హారర్ క్రియే ట్ చేయడం ఛాలెంజ్‌గా అనిపించింది. మంచి థియేటర్ ఎక్స్‌పీరియన్స్ వున్న సినిమా ఇది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు దేవా కట్టా, రామజోగయ్య శాస్త్రి, శశిధర్ రెడ్డి, ఎన్ సినిమాస్ డిస్ట్రిబ్యూటర్లు హనుమంత్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, అరుణ్ పద్మనాభన్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News