Monday, February 24, 2025

యాదాద్రిలో బంగారు విమాన గోపురాన్ని ఆవిష్కరించిన సిఎం

- Advertisement -
- Advertisement -

యాదాద్రి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయంపై ఏర్పాటు చేసిన బంగారు విమాన గోపురాన్ని ఆవిష్కరించారు. ఆదివారం ఉదయం ఆయన సతీమమేతంగా యాదాద్రికి వెళ్లారు. యాగశాల వద్ద ఆయనకు వేదపండితులు, అధికారులు స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆయన దివ్య విమాన స్వర్ణ గోపుర ఆవిష్కరణకు సంబంధించి ‘పంచ కుండాత్మక మహా కుంభాభిషేక సంప్రోక్షణ’ మహోత్సవాల్లో భాగంగా జరిగిన మహా పూర్ణాహుతిలో పాల్గొన్నారు. బంగారు విమాన గోపుర అవిష్కరణ తర్వాత రేవంత్ దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం రేవంత్‌ దంపతులకు వేదపండితులు ఆశ్వీరాదం ఇచ్చారు. కాగా, ఈ గోపురానికి స్వర్ణ తాపడం కోసం రూ.80 కోట్లు ఖర్చు అయినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News