Monday, February 24, 2025

పెళ్లివస్త్రాల్లోనే గ్రూప్‌-2 పరీక్షకి వచ్చిన నవవధువు

- Advertisement -
- Advertisement -

తిరుపతి: ఓవైపు పెళ్లి.. మరోవైపు పరీక్ష.. ఈ రెండు ఒకేసారి వచ్చాయి ఆ అమ్మాయికి. కానీ, ఆ అమ్మాయి ఏదో ఒక దాన్నే ఎంపిక చేసుకొలేదు. ఉన్న సమయంలోనే రెండిటిని పూర్తి చేసింది. ఉదయం వివాహం కాగానే ఆ పెళ్లి వస్త్రాల్లోనే పరీక్ష హాలుకు వచ్చి.. అందరి దృష్టిని ఆకట్టుకుంది.

చిత్తూరుకు చెందిన మమతకు ఆదివారం ఉదయం 6 గంటలకు వివాహం అయింది. వివాహం జరిగిన వెంటనే తిరుపతికి బయల్దేరి ఆమె.. పద్మావతి మహిళ డిగ్రీ కాలేజీ పెళ్లి వస్త్రాల్లోనే వచ్చి.. పరీక్షకు హాజరు అయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అయితే దీనిపై పలువురు విమర్శలు చేస్తున్నారు. ‘అతి చేయడం ఇదే.. ఒక పది నిమిషాల్లో డ్రెస్ మార్చుకొని రావొచ్చు కదా’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News