- Advertisement -
న్యూఢిల్లీ: గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన నవ సత్యగ్రహం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఏప్రిల్ 8, 9 తేదీల్లో గుజారాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎఐసిసి సమావేశాలు జరుగనున్నాయి. ఈ విషయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఏప్రిల్ 8వ తేదీన సిడబ్ల్యూసి సమావేశం జరుగగా, ఏప్రిల్ 9వ తేదీన ఎఐసిసి సమావేశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కేంద్రం బిజెపి ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడం, రాజ్యంగంపై జరుగుతున్న దాడి, భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశానిరి సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, పార్టీ జాతీయ ఆఫీస్ బేరర్లు, సీనియర్ నేతలు, ఇతర ప్రతినిధులు హాజరుకానున్నారు.
- Advertisement -