Monday, February 24, 2025

గెలిచేది ఉపాధ్యాయులా, రియల్టర్‌లా…?

- Advertisement -
- Advertisement -

పొలిటికల్ హీట్‌ను పెంచుతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు
రసవత్తరంగా మారిన ఎన్నికలు
కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ స్థానం కోసం
పలువురి పోటీ
ఎన్నో ఏళ్లుగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న
రెండు అంశాలపై ఇన్నారెడ్డి ఉధృతంగా ప్రచారం

మనతెలంగాణ/హైదరాబాద్:  తెలంగాణలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పొలిటికల్ హీట్‌ను పెంచుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఉపాధ్యాయ ఎన్నికలను అన్ని సంఘాలు సీరియస్‌గా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రచారాన్ని ఉధృతం చేశాయి. దీంతో ఎన్నికల్లో అభ్యర్థుల బలాబలాలు? సంఘాలు అనుసరిస్తున్న వ్యూహాలతో చివరకు ఓటరు ఎవరి వైపు మొగ్గు చూపుతా రన్నది త్వరలోనే తేలనుంది. తెలంగాణలో ముఖ్యంగా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ స్థానానికి జరిగే ఎమ్మెల్సీ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఈ ఎన్నికల బరిలో సుమారుగా పదిహేను మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో కార్పొరేట్‌లు, రియల్టర్‌లు రంగ ప్రవేశం చేయడంతో ఈ ఉపాధ్యాయ ఎన్నికలు ఏ మలుపు తిరుగుతాయన్నది త్వరలో తేలనుంది.

రెండు బలమైన అంశాలతో ఓటర్ల వద్దకు

అయితే అభ్యర్థుల్లో కొందరు ఉపాధ్యాయ వృత్తిని గౌరవంగా భావించి రిటైర్‌మెంట్ వరకు విద్యార్థులకు విద్యాబుద్దులను నేర్పించి ఉత్తమ ఉపాధ్యాయులుగా పేరు తెచ్చుకున్న వారు కూడా ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. దీంతో ఉత్తమ ఉపాధ్యాయులా లేదా రియల్టర్‌ల మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని ఉపాధ్యాయ ఓటర్లు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఉపాధ్యాయ వర్గం నుంచి తిరుమలరెడ్డి ఇన్నారెడ్డి, అశోక్‌లు అభ్యర్థులుగా బరిలో ఉండటంతో పలువురు ఓటర్లు వారిద్దరి వైపే ఎక్కువగా మొగ్గుచూపుతున్నట్టుగా తెలిసింది. అయితే ఇందులో కూడా ఇన్నారెడ్డి బలమైన రెండు అంశాలతో ఓటర్లతో మమేకం అవుతుండడంతో పాటు ఓటర్లలో ఆలోచనలను రేకెత్తుస్తుండడంతో వారు ఆయనవైపే మొగ్గు చూపుతున్నట్టుగా తెలిసింది.

సిపిఎస్ ఉపాధ్యాయ ఓట్లు 11,500 పైగా….

ప్రస్తుతం ఈ ఎన్నికల్లో సిపిఎస్ రద్దు, పాత పెన్షన్ పునరుద్ధరణ అనేది ప్రథమ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇన్నారెడ్డిని గెలిపించుకుంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న ఏకీకృత పెన్షన్ విధానాన్ని వ్యతిరేకించడం, సిపిఎస్‌ను రద్దు చేసేలా ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చే ప్రక్రియను ఆయన చేపడుతారని ఓటర్లు భావిస్తున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం సిపిఎస్ ఉపాధ్యాయ ఓట్లు 11,500 పైగా ఉన్నాయి. పోటీలో ఉన్న ప్రతి అభ్యర్థి సిపిఎస్ యూనియన్ నుంచి పోటీ చేస్తున్న ఇన్నారెడ్డినే మిగతా పార్టీల అభ్యర్థులు ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్నాయి.

ముఖ్యంగా 317 బాధితుల్లో అధిక శాతం ఇప్పుడున్న సంఘాల అభ్యర్థులను పిఓ ప్రెసిడెంటిల్ ఆర్డర్స్ 2018 లో వచ్చిన మూడు సంవత్సరాల కాలంలో సవరణలకు ప్రయత్నాలు జరగకపోగా, 2021లో 317 జిఓ వచ్చాక చాలామంది సిపిఎస్ ఉపాధ్యాయులను ప్రభుత్వం మారుమూల జిల్లాలకు బదిలీ చేసింది. ప్రస్తుతం వారి నుంచి తీవ్ర వ్యతిరేకంగా ఉండడం, కేంద్ర ప్రభుత్వం యూపిఎస్‌ను అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించిన నేపథ్యంలో చాలామంది ఉపాధ్యాయులు ఈ అంశాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇన్నారెడ్డికి ఈ రెండు అంశాలపై పూర్తిగా అవగాహన ఉండడం, ఆయన్ను గెలిపిస్తే ప్రభుత్వంతో మాట్లాడి ఉపాధ్యాయులకు మేలు చేసేలా ఉత్తర్వులు తీసుకొస్తారని పలువురు ఓటర్లు భావిస్తున్నారని తెలిసింది.

14 శాసనసభ స్థానాలను ప్రభావితం సిపిఎస్ ఓటర్లు

అయితే మిగతా అభ్యర్థులు 317 జిఓతో పాటు సిపిఎస్ రద్దు, యూపిఎస్ అమలు గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో వారు మాట్లాడే పరిస్థితి లేకపోవడం, ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం లేకపోవడం లాంటి ప్రతిబంధకాలు ఉన్నాయని ఓటర్లు భావిస్తున్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఈ రెండు అంశాలపై ఇన్నారెడ్డి ప్రచారం ఉధృతం సాగుతోందని తెలిసింది. సిపిఎస్ ఓటర్లు (ఉపాధ్యాయులు) ఇప్పటికే ఇన్నారెడ్డిని గెలిపించేలా ప్రతి ఒక్క ఓటరును కలుస్తూ ఇన్నారెడ్డి గెలిపిస్తే కలిగే ప్రయోజనాలు తెలియచేస్తున్నారు. గత సంవత్సరం జరిగిన సాధారణ ఎన్నికల్లో సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల ఓట్ ఫర్ ఓపిఎస్ నినాదం ద్వారా రాష్ట్రంలోని 14 శాసనసభ స్థానాలను ప్రభావితం చేశారు. అంతేకాకుండా గత ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల్లో కూర రఘోత్తమ రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి గెలుపులో సిపిఎస్ ఉపాధ్యాయుల ఓట్లను కూడా ప్రభావితం చేయడం విశేషం. ఇప్పటికే ఇన్నారెడ్డికి పలు సంఘాల నాయకుల కూడా మద్ధతు తెలుపుతూ లేఖలను అందచేయడంతో మిగతా అభ్యర్థుల్లో టెన్షన్ మొదలయ్యింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News